దిమ్మ తిరిగే స్పీడుతో కంప్యూటర్‌

24 Oct, 2019 03:42 IST|Sakshi
క్వాంటమ్‌ కంప్యూటర్‌ వద్ద సుందర్‌ పిచాయ్‌

పారిస్‌: సూపర్‌ ఫాస్ట్‌ కంప్యూటర్లు 10 వేల యేళ్లలో గణించగల గణనలను కేవలం 200 సెకన్లలో సాధించిన కొత్త కంప్యూటర్‌ ‘సికామోర్‌ మెషీన్‌’ను శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఇది సూపర్‌ కంప్యూటర్లకంటే కోట్ల రెట్ల వేగంతో పని చేసిందని బుధవారం తెలిపారు. ఈ తరహా వేగాన్ని ‘క్వాంటమ్‌ సుప్రిమసీ’ అంటారు. గూగుల్‌ సంస్థకు చెందిన పరిశోధనా బృందం దీన్ని తయారు చేస్తోంది. సాధారణ కంప్యూటర్లు ప్రతి విషయాన్ని బైనరీల రూపంలో (1, 0) అర్థం చేసుకుంటాయి. ఇందులోనూ అదే పద్ధతి ఉన్నా రెంటినీ ఒకేసారి తీసుకోగలదు. సాధారణ కంప్యూటర్లు సమాచారాన్ని బిట్స్‌ రూపంలో తీసుకుంటుండగా, సికామోర్‌ క్యూబిట్స్‌ రూపంలో తీసుకుంటుంది. ఇందులోని క్వాంటమ్‌ ప్రాసెసర్‌ 54 క్యూబిట్స్‌ సామర్థ్యంతో తయారైంది. తమ సంస్థకు చెందిన ఉద్యోగులు దీన్ని నిర్మించడం తమకు గర్వకారణమని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ట్వీట్‌చేశారు.

మరిన్ని వార్తలు