మూడోసారీ బ్రెగ్జిట్‌కు తిరస్కరణే

30 Mar, 2019 05:39 IST|Sakshi
బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే

లండన్‌: మూడోసారి కూడా బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే తెచ్చిన బ్రెగ్జిట్‌ బిల్లును ఆ దేశ పార్లమెంటు శుక్రవారం తిరస్కరించింది. దీంతో యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకొచ్చే పద్ధతి మరింత సంక్లిష్టమైంది. మే తెచ్చిన తాజా బిల్లుకు పార్లమెంటులో అనుకూలంగా 286 ఓట్లు, వ్యతిరేకంగా 344 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే బ్రెగ్జిట్‌కు సంబంధించిన అన్ని బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు థెరెసాకు మే 22వ తేదీ వరకు సమయం దొరికేది. వాస్తవానికి గత ప్రణాళిక ప్రకారం శుక్రవారం నుంచే (మార్చి 29) బ్రెగ్జిట్‌ ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. బ్రెగ్జిట్‌ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందక పోవడంతో అది వాయిదా పడింది.

>
మరిన్ని వార్తలు