బ్రిటన్ ప్రధాని ఇంట.. దీపావళి సంబరాలు

9 Nov, 2023 12:08 IST|Sakshi

లండన్: లండన్ వేదికగా దీపావళి సంబరాలు ఊపందుకున్నాయి. సాక్షాత్తు ప్రధాని నివాసం అధికారిక భవనంలో వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగాయి. దీపావళి వేడుకలకు హిందూ బంధువులను ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి ఆహ్వానించారు. చీకటిపై వెలుతురు విజయ సూచకంగా దీపాలను వెలిగిస్తున్న ఫొటోలను ప్రధాని రిషి సునాక్ అధికారిక ఖాతాలో పంచుకున్నారు.  

అక్షతా మూర్తి దీపాలను వెలిగిస్తుండగా.. ఆమె చుట్టూ జనం గుమిగూడి ఉన్న ఫొటోలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. యూకే, ప్రపంచమంతటా దీపావళి వేడుకలను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. 

చీకటిపై వెలుతురు, చెడుపై మంచి విజయసూచకంగా దీపావళి పండుగను హిందువులు ఈ ఏడాది నవంబర్ 12న జరుపుకుంటారు. ఇరు దేశాల నాయకులు రిషి సునాక్, ప్రధాని మోదీ ఇటీవల టెలిఫొన్‌లో సంభాషించుకున్నారు. స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందంపై పురోగతి దిశగా అడుగులు పడ్డాయని పేర్కొన్నారు. వరల్డ్ కప్ సందర్భంగా భారత్‌కు రిషి సునాక్ శుభాకాంక్షలు తెలిపారు. 

ఇదీ చదవండి: నేను భారతీయురాలినైతేనా..? నితీష్ వ్యాఖ్యలపై అమెరికా సింగర్ ఫైర్

మరిన్ని వార్తలు