ఈ ఫోన్‌తో ల్యాపీ, డెస్క్‌టాప్ మీ దగ్గరున్నట్టే!

28 Feb, 2016 11:33 IST|Sakshi
ఈ ఫోన్‌తో ల్యాపీ, డెస్క్‌టాప్ మీ దగ్గరున్నట్టే!

ప్రఖ్యాత ఐటీ కంపెనీ హెచ్‌పీ తన లేటెస్ట్ ప్రాడక్ట్‌తో వరల్డ్‌ మొబైల్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తన ఫ్లాగ్‌షిప్‌ మోడలైన హెచ్‌పీ 'ఎలైట్ ఎక్స్‌3' స్మార్ట్‌ఫోన్ను ఎండబ్ల్యూసీలో ఆవిష్కరించింది. విండోస్ 10 మొబైల్ ఆపరేటింగ్ సిస్టంతోపాటు మైక్రోసాఫ్ట్‌ ఫీచర్స్ అన్ని ఇందులో పనిచేయనుండటం గమనార్హం. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆల్మోస్ట్‌ కంప్యూటర్‌లానే వ్యవహరిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇందులోని ఫీచర్స్ ఆధారంగా దీనిని ల్యాప్‌టాప్‌గానూ, డెస్క్‌టాప్‌గానూ వాడుకోవచ్చు.

మైక్రోసాఫ్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తున్న రెండోస్మార్ట్‌ ఫోన్‌ ఎలైట్‌ ఎక్స్‌3. గతంలోనూ హెచ్‌పీ ఇలాంటి మోడల్‌ను విడుదల చేసింది.  మైక్రోసాఫ్ట్‌ సంస్థ భాగస్వామ్యంతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆరు అంగుళాల తాకే తెర (టచ్ స్క్రీన్‌) ఉంటుంది.  విండోస్ 10 మొబైల్ ఆపరేటింగ్‌ సిస్టంతో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో విండోస్ 10 'కంటిన్యూమ్‌' ఫీచర్ స్పెషల్ అట్రాక్షన్‌. దీనిద్వారా ఎలైట్ ఎక్స్3ని డెస్క్‌టాప్‌గానూ, ల్యాప్‌టాప్‌గానూ వాడుకోవచ్చు.

ఎలైట్ ఎక్స్‌3 లోని ఫీచర్స్‌
డిస్‌ప్లే: 5.96-అంగుళాలు, గొరిల్లా గ్లాస్-4 ప్రొటెక్షన్‌తో వస్తుంది
ప్రాసెసర్‌: Qualcomm Snapdragon 820
ర్యామ్‌: 4జీబీ
ఇన్‌బిల్ట్‌ స్టోరెజ్‌: 64 జీబీ
అదనపు స్టోరేజ్‌ కోసం మైక్రో ఎస్డీ కార్డ్ సౌలభ్యం
బ్యాక్‌ కెమెరా: 15 మెగా పిక్సల్
ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4150 mAh