స్వచ్ఛ అభియాన్..

7 Oct, 2014 02:19 IST|Sakshi
స్వచ్ఛ అభియాన్..

మార్కెట్లో ఎన్నో హ్యాండ్ వాష్‌లు ఉన్నాయికదా.. అలాంటివాటిల్లో ఇది హైటెక్. దీని పేరు ఐ-వాష్. దీని కింద మనం చేతులు పెడితే.. ఇందులో ఉండే ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్లు, డిజిటల్ మైక్రోస్కోప్ మన చేతులను పరిశీలిస్తాయి. వెంటనే ఎన్ని క్రిములు ఉన్నాయన్న విషయం పైన ఉండే పారదర్శక తెరపై ప్రత్యక్షమైపోతుంది. హెచ్చరికగా రెడ్‌లైట్ వెలుగుతుంది. మనం చేతులను శుభ్రపరుచుకుంటున్న కొద్దీ.. రెడ్‌లైట్ నెమ్మదిగా గ్రీన్ కలర్‌లోకి మారుతుంది. బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోగానే.. తెర కూడా మళ్లీ పారదర్శకంగా మారిపోతుంది. ఐ-వాష్ స్వీయ శుభ్రతపట్ల ప్రజలకు మరింత అవగాహనను కల్పిస్తుందని యాంకో డిజైన్.కామ్ తెలిపింది.

మరిన్ని వార్తలు