పావురాలూ పదాలను గుర్తిస్తాయి!

20 Sep, 2016 03:37 IST|Sakshi
పావురాలూ పదాలను గుర్తిస్తాయి!

బెర్లిన్: పావురాలు ఇంగ్లిష్ పదాలను నేర్చుకోగలవని పరిశోధనలో తేలింది. ఇలాంటి సంక్లిష్ట పరీక్షల్లో బబూన్ జాతి కోతులతో సమానంగా పక్షులు కూడా ప్రతిభ చూపిస్తాయని న్యూజిలాండ్‌లోని ఒటాగో వర్సిటీ, జర్మనీలోని రుహుర్ వర్సిటీలు అధ్యయనంలో గుర్తించాయి. స్క్రీన్‌పై వచ్చే నాలుగు ఇంగ్లిష్ అక్షరాల పదాలను గుర్తించేలా పావురాలకు శిక్షణ ఇచ్చారు.  కొన్ని గుర్తులను కూడా గుర్తించేలా చేశారు. గుర్తుల నుంచి అక్షరాలను పావురాలు వేరు చేసి గుర్తుపడుతున్నాయా అని పరీక్షించారు. 26 నుంచి 58 అక్షరాలతో కూడిన పదాల సముదాయాలను, 8 వేలకు పైగా గుర్తులను చూపించారు.

అప్పుడు కొత్తగా చూపిన పదాలను పావురాలు కచ్చితంగా గుర్తించాయి. ఎప్పుడో 30 కోట్ల ఏళ్ల కింద మానవుల నుంచి పావురాలు(పక్షి జాతి) పరిణామం చెంది, వేర్వేరు మెదడు అమరిక ఉన్నా మానవుల్లాగే  అక్షరాల్ని  గుర్తించే సామర్థ్యం ఒకేలా ఉండటం ఆశ్చర్యమని శాస్త్రవేత్తలు చెప్పారు.

మరిన్ని వార్తలు