అజ్ఞాతవాసి!

7 Jan, 2018 01:47 IST|Sakshi

పొద్దున లేవగానే ఫేస్‌బుక్‌లోనో.. వాట్సాప్‌లోనో, ట్వీటర్‌లోనో మన ఫొటోలు షేర్‌ చేస్తుంటాం. వాటికి లైక్స్‌.. కామెంట్లు.. షేర్లు ఎన్ని వచ్చాయో తరచూ చెక్‌ చేసుకునే వాళ్లూ ఉంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఓ వ్యక్తి గత 25 ఏళ్ల నుంచి తనెవరో తెలియకుండా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాడు. ఆఖరికి గూగుల్‌ కంపెనీ కూడా అతడి ఫొటోల కోసం వెతికినా ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు. అతడి పేరు జొనాథన్‌ హిర్షన్‌. పబ్లిక్‌ రిలేషన్స్‌ అధికారి. హిర్షన్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటాడట.

అతడి ఫేస్‌బుక్‌లో దాదాపుగా 3వేల మంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. అంతేకాదు.. ఎప్పటికప్పుడు తను ఏం చేస్తున్నాడో వ్యక్తిగత వివరాలను కూడా అప్‌డేట్‌ చేస్తుంటాడు. అయితే కేవలం అతడి ముఖాన్ని మాత్రం ఎవరికీ తెలియకుండా దాచేసుకున్నాడు. ఫొటోలు కూడా ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తుంటాడు కానీ ముఖంపై వేరు వేరు బొమ్మలను ఎడిట్‌ చేసి అప్‌లోడ్‌ చేస్తాడు. మరి ఎప్పటికి మనోడు అజ్ఞాతవాసం వీడుతాడో వేచిచూడాల్సిందే..!  

మరిన్ని వార్తలు