సైకిల్ రైడర్ కు గిన్నిస్ రికార్డ్..!

21 Sep, 2016 21:10 IST|Sakshi
సైకిల్ రైడర్ కు గిన్నిస్ రికార్డ్..!

గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించేందుకు ఒక్కొక్కరూ ఒక్కో రకంగా కృషి చేస్తుంటారు. కొందరు ప్రాణాలకు తెగించి ప్రదర్శనలు కూడా ఇస్తుంటారు. అయితే  అబ్దుల్ రెహమాన్ ఒకే టైరుమీత అత్యధిక దూరం సైకిల్ నడపడంతోపాటు.. ఒకటైరుమీద ప్రయాణిస్తూనే సైకిల్ ను ఆపి, 'లాంగెస్ట్ బైసికిల్ స్టాపీ'గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు.

ఇండియాకు చెందిన అబ్దుల్ రెహమాన్ వినూత్న ఫీట్ తో ప్రపంచ రికార్డును సంపాదించాడు. సైకిల్ వెనుక చక్రం గాల్లో తేలేలా.. ముందు చక్రంతో మాత్రమే కొంత దూరం సైకిల్ పై ప్రయాణించడంతోపాటు, కాళ్ళను హ్యాండిల్ బార్ పై పెట్టి సైకిల్ ను ఆపే అసాధారణ ఫీట్ చేసిన అబ్దుల్ గిన్నిస్ పుటలకెక్కాడు. మొత్తం 57 అడుగుల 3.97 అంగుళాల దూరం ప్రయాణించి ఈ రికార్డును సాధించగలిగాడు.

మరిన్ని వార్తలు