అట్లాస్ రామచంద్రన్కు మూడేళ్ల జైలు

12 Nov, 2015 18:21 IST|Sakshi
అట్లాస్ రామచంద్రన్కు మూడేళ్ల జైలు

అబుదాబి: అట్లాస్ రామంచంద్రన్ గా గుర్తింపు పొందిన  భారతీయ వ్యాపారవేత్తకు దుబాయి కోర్టు మూడేళ్ల  జైలు శిక్ష విధించింది. అట్లాస్ గ్రూప్ ఇచ్చిన చెక్  బౌన్స్, తదితర ఆర్థిక నేరాల ఆరోపణను రామ చంద్రన్ ఎదుర్కొంటున్నారు.  సుమారు 34 మిలియన్ దినార్ ల విలువ జేసే చెక్కులు బౌన్స్  కేసులో  అట్లాస్  సైకిల్స్ అధినేత రామచంద్రన్ (74)  గత ఆగస్టు నుంచి పోలీసు కస్టడీలో ఉన్నారు.

గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ (జీసీసీ)  వందమంది అతి ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్న రామచంద్రన్ ఇటీవల అప్పులతో పాటు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. బ్యాంకుల రుణాలను చెల్లించడంలో విఫలం కావడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి.  బంగారు ఆభరణాలు, ఆసుపత్రుల రంగంలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న  ఈ వ్యాపార   దిగ్గజం  నటుడు, దర్శకుడు కూడా.

500 మిలియన్ దినార్ ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన అట్లాస్ జువెల్లరీ, రుణాలను తిరిగి చెల్లించడానికి, GCC దేశాలన్నిటా ఉన్న తమ అన్ని ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. దుబాయి లోని యునైటెడ్ నేషనల్ బాంకు ఆవరణలో అతిరహస్యంగా ఏర్పాటు చేయబడిన సమావేశంలో, ని రామచంద్రన్ భార్య ఇందిరా రామచంద్రన్, తమకు రుణాలిచ్చిన 20 బాంకుల వారితో వివిధ రకాల రుణ చెల్లింపు అవకాశాలను గురించి గతంలోనే చర్చించినట్టు తెలుస్తోంది.

 

అయితే తమ సంస్థ ప్రతి ఒక్క రుణాన్ని పూర్తిగా తీర్చడానికే కట్టుబడిందని, ఈ విధమైన ఎత్తుపల్లాలు సాధారణమని, వీటిని అధిగమించే సత్తా తమకు ఉందని సంస్థ  ప్రతినిధి  తెలిపారు. మరోవైపు కోర్టు తీర్పు వెలువడిన వెంటనే రామచంద్రన్ భార్య ఇందిరా రామచంద్రన్  కంటతడి పెట్టారు.
 

మరిన్ని వార్తలు