‘మామ్’కు అంతరిక్షంలో 300 రోజులు

3 Sep, 2014 03:08 IST|Sakshi
‘మామ్’కు అంతరిక్షంలో 300 రోజులు

చెన్నై: అరుణగ్రహం దిశగా నిరంతరం దూసుకుపోతున్న మార్స్ ఆర్బిటర్ మిషన్(మంగళ్‌యాన్-మామ్) ఉపగ్రహం అంతరిక్షంలో 300 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. మామ్ అంగారకుడి కక్ష్యను చేరేందుకు మరో 22 రోజులే మిగిలి ఉంది. ప్రస్తుతం భూమికి 19.90 కోట్ల కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తున్న మామ్ సెకనుకు 22.33 కి.మీ. వేగంతో దూసుకెళుతోందని, ఇప్పటిదాకా మొత్తం 62.20 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మంగళవారం తన ఫేస్‌బుక్ పేజీలో పేర్కొంది. ఉపగ్రహం అన్ని రకాలుగా బాగుందని, సెప్టెంబర్ 24న మార్స్ కక్ష్యను చేరనుందని తెలిపింది.

>
మరిన్ని వార్తలు