భారత నేతలు అనవసరంగా పాక్‌ను నిందిస్తున్నారు

31 Oct, 2013 22:30 IST|Sakshi

బ్రిటిష్ ఉప ప్రధానితో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్
 ఇస్లామాబాద్: భారత నేతలు ఇప్పటికీ పాకిస్థాన్‌ను అనవసరంగా నిందిస్తున్నారని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. ఒకవైపు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద తరచు జరుగుతున్న కాల్పుల విరమణ ఉల్లంఘనలతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న సమయంలో బ్రిటిష్ ఉపప్రధాని నిక్ క్లెగ్ వద్ద నవాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. లండన్‌లో ఇటీవల పర్యటించిన నవాజ్, తన పర్యటనలో భాగంగా క్లెగ్‌తో భేటీ అయ్యారు. భారత్‌ను నిందించడం తాము మానేసినా, భారత రాజకీయ నాయకులు మాత్రం ఇప్పటికీ పాక్‌ను నిందించడం కొనసాగిస్తున్నారని అన్నారు. భారత్‌తో గల అన్ని సమస్యలనూ పరిష్కరించుకునేందుకు పాక్ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, మరోవైపు తాలిబన్లతో కూడా చర్చలు ప్రారంభించామని క్లెగ్‌తో చెప్పారు.
 

మరిన్ని వార్తలు