ఇకపై పార్కింగ్‌ సమస్య ఉండదు!

1 Nov, 2018 04:00 IST|Sakshi

హూస్టన్‌: ఆఫీస్, షాపింగ్‌ మాల్‌కు వెళ్లినప్పుడు కారు లేదా బైక్‌ను పార్క్‌ చేయడానికి ఎక్కడ ఖాళీగా ఉందా.. అని వెతకాడనికే సమయం వృథాకావటం చూస్తుంటాం. అమెరికాలోని అలబామా వర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి మెట్టుపల్లి సాయినిఖిల్‌రెడ్డి ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న సంక్లిష్టమైన, ఖర్చుతో కూడిన పార్కింగ్‌ యాప్స్‌ కంటే భిన్నంగా స్పేస్‌ డిటెక్టింగ్‌ పద్ధతిలో దీనిని అభివృద్ధి చేశారు. బిగ్‌డేటా ఎనలిటిక్స్, డీప్‌ లెర్నింగ్‌ టెక్నిక్స్‌ సాయంతో డేటాను విశ్లేషించి డ్రైవర్లు నేరుగా పార్కింగ్‌లో ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటుందో చెబుతుంది. ఈ ఆవిష్కరణకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఓపెన్‌ హౌస్‌ పోటీ (2018)ల్లో రెండో బహుమతి వచ్చింది.

మరిన్ని వార్తలు