యూఎస్‌లో డీసీ కోర్టు జడ్జిగా ఇండో అమెరికన్‌ 

22 Mar, 2019 01:00 IST|Sakshi

బాధ్యతలు స్వీకరించిన నియోమీ రావు  

వాషింగ్టన్‌: అమెరికాలోని ప్రఖ్యాత డిస్ట్రిక్‌ ఆఫ్‌ కొలంబియా సర్క్యూట్‌ కోర్టు (డీసీ కోర్టు) జడ్జిగా ప్రముఖ భారతీయ అమెరికన్‌ న్యాయవాది నియోమీ జహంగీర్‌రావు ఎన్నికయ్యారు. వైట్‌హౌస్‌లోని రూస్‌వెల్ట్‌ రూమ్‌లో ఆమె యూఎస్‌ సర్క్యూట్‌ జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. యూఎస్‌ సుప్రీంకోర్టు జస్టిస్‌ క్లారెన్స్‌ థామస్‌ నేతృత్వంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. భర్త అలెన్‌ లెఫ్కోవిజ్‌తో కలసి బైబిల్‌పై ప్రమాణం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత నవంబర్‌లో నియోమీని జడ్జిగా నామినేట్‌ చేశారు.

ఆమె నియామకానికి 53–46 ఓట్ల తేడాతో సెనేట్‌ ఇటీవల ఆమోదం తెలిపింది. కాగా, నియోమీ గతంలో ఆఫీస్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ రెగ్యులేటరీ అఫైర్స్‌ (ఓఐఆర్‌ఏ)లో అడ్మినిస్ట్రేటర్‌గా కీలక పాత్ర పోషించారు. అమెరికాలోని ప్రముఖ కోర్టుల్లో సుప్రీంకోర్టు తర్వాత డీసీ కోర్టు కీలకం. డీసీ కోర్టు జడ్జిగా నియమితులైన భారతీయుల్లో నియోమీ రెండో వ్యక్తి. గతంలో శ్రీ శ్రీనివాసన్‌ అనే వ్యక్తి డీసీ కోర్టు జడ్జిగా వ్యవహరించారు.    

మరిన్ని వార్తలు