‘శ్రీలంక పేలుళ్లు మా పనే’

23 Apr, 2019 17:55 IST|Sakshi

కొలంబో : శ్రీలంకను వణికించిన వరుస పేలుళ్లకు తామే పాల్పడ్డామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ప్రకటించింది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం జరిగిన వరుస పేలుళ్లలో 321 మంది మరణించగా, దాదాపు 500 మంది గాయపడ్డారు. పేలుళ్ల ఘటన ఐఎస్‌ మిలిటెంట్‌ గ్రూపు చర్యేనని అమెరికన్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఘటన జరిగిన వెంటనే స్పందించే ఐఎస్‌ ఘటనకు తామే పాల్పడ్డామని ప్రకటించడంలో జాప్యం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ మసీదులో ఇటీవల జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లకు పాల్పడ్డారని శ్రీలంక అధికారులు పేర్కొన్నారు. పేలుళ్ల ఘటనకు లంకకు చెందిన రెండు ఇస్లామిస్ట్‌ గ్రూపులే బాధ్యులని భావిస్తున్నారు. న్యూజిలాండ్‌లో మసీదుపై జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లు జరిగాయని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువన్‌ విజేవర్ధనే వెల్లడించారు. కాగా పేలుళ్ల ఘటనకు సంబంధించి అనుమానితుడిగా భావించి ఓ సిరియన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు