జైలులో ఉండగానే అత్యున్నత అవార్డు

29 Oct, 2015 18:46 IST|Sakshi
జైలులో ఉండగానే అత్యున్నత అవార్డు

ప్యారిస్: జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ సౌదీ అరేబియాకు చెందిన బ్లాగర్ అరుదైన ఘనత దక్కించుకున్నాడు. అతడిని ప్రతిష్టాత్మక యూరోపియన్ యూనియన్ హక్కుల అవార్డు సఖరోవ్ ప్రైజ్ వరించింది. భావప్రకటన స్వేచ్ఛా హక్కును అతడు కాపాడినందుకు గుర్తుగా ఈ అవార్డును ప్రకటించారు. సాధారణంగా మానవ హక్కులను రక్షించడంలో కృషి చేసిన వారికి ఆండ్రే సఖరోవ్ పేరు మీద ఈ అవార్డు ప్రతి సంవత్సరం అందిస్తారు. దీనిని 1988లో ప్రారంభించారు.

రైఫ్ బదావీ అనే ఓ సౌదీ పౌరుడిని ముస్లిం మత పెద్దలను కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలతో జైలులో వేశారు. అతడికి పదేళ్ల జైలు శిక్షతోపాటు వెయ్యి సౌదీ రియాలను జరిమానా కూడా విధించింది. ప్రస్తుతం అతడు జైలులోనే ఉన్నాడు. రైఫ్కు ఈ అవార్డు ప్రకటించిన సందర్భంగా యూరోపియన్ పార్లమెంటు అధ్యక్షుడు మార్టిన్ షుంజ్ మాట్లాడుతూ 'నేను సౌదీ రాజుకు విన్నవిస్తున్నాను. రైఫ్ను వెంటనే విడిచిపెట్టాలని. అతడికి స్వేచ్ఛను ఇవ్వాలని. అలా చేయడం ద్వారా తాము ఇచ్చే గౌరవ బహుమతిని స్వీకరిస్తాడు' అని అన్నారు.

మరిన్ని వార్తలు