కోవిడ్‌-19 : ముద్దులకు దూరంగా ఉంటేనే మంచిది

26 Feb, 2020 13:28 IST|Sakshi

న్యూయార్క్‌ : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో వివిధ దేశాల ప్రతినిధులు దాని బారీ నుంచి తప్పించుకోవడానికి పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. కేవలం రెండు నెలల్లోనే 2700 మందికి పైగా ప్రాణాలను తీసుకున్న కోవిడ్‌-19 దాదాపు 12 దేశాల్లో విస్తరించింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ సో​కిన దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. గతంలోనూ 1439 సంవత్సరంలో ఇంగ్లండ్‌ దేశంలో ప్లేగు వ్యాది సోకినప్పుడు అప్పటి మహారాజు కింగ్‌ హెన్రీ-6 ఇలాగే ముద్దు పెట్టుకోవడం బ్యాన్‌ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇటలీ, చైనా, అమెరికా, పలు యూరప్‌ దేశాల్లో కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, హైఫైలు, షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకోవడం నిషేదించారు. ఇదే విషయమై రోమ్‌​కు చెందిన 36 ఏళ్ల ఆర్తికవేత్త జార్జియా నిగ్రి మాట్లాడుతూ.. ఇటలీలో కరోనా వైరస్‌ సోకి ఏడుగురు మృతి చెందడంతో అక్కడి ప్రజలు అప్రమత్తమయ్యారు. ఎవరికైనా సెండాఫ్‌ ఇవ్వాలన్న లేదా ఆహ్వానించాలన్న చేతులతో కాకుండా కేవలం గ్రీటింగ్స్‌ ఇచ్చుకోవడం చేస్తున్నారని  పేర్కొన్నాడు. మొదట ఇదంతా తనకు తప్పుగా కనిపించినా వైరస్‌ నుంచి తప్పించుకోవాలంటే ఇదే సరైన మార్గం అని చెప్పుకొచ్చాడు. (హాలీవుడ్‌ మూవీపై కరోనా ఎఫెక్ట్‌)

మరోవైపు యూరప్‌ దేశంలో కరోనా నేపథ్యంలో ప్రేమికుల రోజుకు అక్కడి ప్రజలు దూరంగా ఉన్నట్లు డెయిలీ మెయిల్‌, ది సన్‌ పత్రికలు ప్రచురించాయి. భారత్‌, సింగపూర్‌, రష్యా, ఇరాన్‌ వంటి దేశాల్లో కూడా కౌగిలింతలు, ముద్దులు, షేక్‌ హ్యాండ్‌లు చేసుకోవద్దంటూ ఫోన్‌ ద్వారా సూచిస్తున్నారు. ఇటీవలే చైనాలో బహిరంగ సభలో ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. కరోనాకు దూరంగా ఉండాలంటే మనుషుల మధ్య షేక్‌ హ్యాండ్‌లు ఇచ్చుకోకపోవడమే మంచిదని పేర్కొన్నారు. జపాన్‌లోనూ కరోనాను దూరంగా ఉంచాలంటే అక్కడి సంప్రదాయాలను పక్కన పెట్టడంతో పాటు శారీరక చర్యలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందిస్తూ.. కరోనా వైరస్ ప్రబలడానికి గల కారణాలు సరిగా తెలియదు. ఏదేతైనేం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయా దేశాలు తీసుకున్న నిర్ణయాలు సరైనవేనని పేర్కొంది. కరోనా సోకిన వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఒక మీటరు దూరంలో ఉండి మాట్లాడితే మంచిదని తెలిపారు. 
(కరోనా నుంచి తప్పించుకోవడానికి ఏం చేశారంటే)

మరిన్ని వార్తలు