సింగర్ కు చేదు అనుభవం

16 Aug, 2015 11:08 IST|Sakshi
సింగర్ కు చేదు అనుభవం

లాస్ ఏంజిల్స్ : ఆస్ట్రేలియాకు చెందిన పాప్ సింగర్ కైలీ మినోగ్ కు ఓ కార్యక్రమం సందర్భంగా చేదు అనుభవం ఎదురైంది. ఆమె తన కొత్త ఆల్బమ్ వీడియో 'అబ్ సోల్యూట్లీ ఎనీథింగ్ అండ్ ఎనీథింగ్ ఎట్ ఆల్' ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కైలీ పాల్గొన్నది. ఈ ఈవెంట్ కు వచ్చిన ఆమె వైట్-బ్లాక్ కలర్ కలిసి ఉన్న ఓ డ్రస్ ఆమె ధరించారు. అయితే ఇందులో భాగంగా ఆమె స్టేజీపై డ్యాన్స్ చేస్తుండగా కైలీ డ్రెస్ టాప్ భాగం కొంత తొలగిపోయింది. పూర్తిగా డ్యాన్స్లో లీనమైన సింగర్ వెంటనే ఈ విషయాన్ని గ్రహించిన ఆమె టాప్ ను సరిచేసుకుంది. చేతులతో ఛాతీ భాగాన్ని కప్పివేసి త్వరగా డ్రెస్ పైభాగంలో ఉన్న జిప్ సవరించుకోవడంతో అవమానాన్ని త్రుటిలో తప్పించుకుంది.

అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో ఆమె ఆశ్చార్యానికి లోనయింది. ఈ సన్నివేశం జరుగుతున్నప్పుడు ఆమె నవ్వుతూనే ఉంది, కెమెరా వైపు చూస్తూ ఇక ఆపండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే అక్కడే ఉన్న కొందరూ తీస్తున్న వీడియోలో ఈ సన్నివేశం కూడా రికార్డయింది. అనంతరం ఇన్ స్టాగ్రామ్లో ఈ వీడియో ఎవరో ఆకతాయి అప్ లోడ్ చేయడంతో ఈ విషయం స్థానిక మీడియాలో హల్ చల్ చేసింది.

మరిన్ని వార్తలు