'లైఫ్ ఆఫ్ పై' పులికి ఎంత కష్టం..!?

23 Dec, 2015 10:01 IST|Sakshi
'లైఫ్ ఆఫ్ పై' పులికి ఎంత కష్టం..!?

'లైఫ్ ఆఫ్ పై' సినిమా గుర్తుంది కదా! బతకాలనే ఆశతోపాటు సర్వం కోల్పోయినా.. జీవితం నిర్దేశిత గమ్యానికే చేరుతుందనే సందేశానికి అద్భుతమైన విజువల్స్ జోడించి రూపొందించిన ఆ సినిమాలో హీరో 'పై పటేల్' తోపాటు 'రిచర్డ్ పార్కర్' గా నటించిన పులి కూడా అందర్నీ మెప్పించింది. ఇప్పుడా పులికి పెద్ద కష్టమొచ్చిపడింది. నిజం చెప్పాలంటే ఇప్పుడేకాదు.. ఎప్పట్నుంచో అది అనుభవిస్తున్న హింస వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం కెనడాలోని ఒంటారియోలో గల ఓ జూలో నివరిస్తున్న పులిని.. దాని సంరక్షకుడే హింసించిన వీడియోను ప్రఖ్యాత జంతుసంరక్షణ సంస్థ పెటా వెలుగులోకి తెచ్చింది. సొంతగా జూపార్క్ను నడిపే మిచెల్ హాకెన్ బర్గర్ అనే పెద్దమనిషే అక్కడి జంతువులకు ట్రైనింగ్ ఇస్తూఉంటాడు. 'లైఫ్ ఆఫ్ పై'లో నటించేందుకు యునో(పులి పేరు)కు శిక్షణ ఇచ్చింది కూడా ఆయనే. జంతుశిక్షకుడిగా మిచెల్ కు ఎంత పేరుందో అంతకంటే ఎక్కువే ఆరోపణలున్నాయి. ఆయన జంతువులను హింసిస్తాడని పెటా మెదటినుంచి వాదిస్తూనేఉంది. తాజాగా రహస్యంగా చిత్రీకరించిన ఓ వీడియోలో ఆ ఆరోపణలు నిజమేనని తేలింది.

కొరడాతో పులిని పదేపదే కొడుతూ, పచ్చిబూతులు తిట్టినవైనమంతా వీడియోలో రికార్డయింది. 'పులి నొటిపై, కాళ్లమీదా కొడితే నాకు ఆనందం కలుగుతుంది' అని మిచెల్ మాటలు వీడియోలో స్పష్టంగా వినిపించాయని, వీటి ఆధారంగా ఆయనపై కేసు పెట్టనున్నట్లు పెటా సంస్థ డిప్యూటీ డైరెక్టర్ బ్రిట్టానీ పీట్ మీడియాకు చెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా