మైక్రోవేవ్‌ ఓవెన్‌.. ఓ కాలుష్య బాంబు

19 Jan, 2018 02:48 IST|Sakshi

లండన్‌: వంటింట్లో వాడుతున్న మైక్రోవేవ్‌ ఓవెన్‌ కాలుష్యాన్ని వెదజల్లే బాంబు అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కారు నుంచి వెలువడే కార్బన్‌ డయాక్సైడ్‌ కన్నా ఓవెన్‌ల నుంచి వెలువడే కార్బన్‌ డయాక్సైడే అధికమని తాజా పరిశోధనలో తేలింది. యూరప్‌లో ఒక్క ఏడాది కాలంలో ఓవెన్ల నుంచి 7.7 మిలియన్ల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ వెలువడుతుంది.

ఇది ఒక ఏడాదిలో 68 లక్షల కార్ల నుంచి వెలువడే కార్బన్‌ డయాక్సైడ్‌తో సమానం. అక్కడ గంటకు 9.4 టెరావాట్ల విద్యుత్‌ను ఓవెన్లు వాడేస్తున్నాయి. ఇది ఏడాది కాలంలో 3 పెద్ద గ్యాస్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఉత్పత్తి చేసే విద్యుత్‌తో సమానం. ఓవెన్ల తయారీ దశ నుంచి వ్యర్థాలుగా మారే దశ వరకు పర్యావరణంపై చూపే దుష్ప్రభావాన్ని అంచనా వేసేందుకు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు.

మరిన్ని వార్తలు