ప్రమాదక స్థాయిలో ఢిల్లీ వాయు కాలుష్యం.. 616 పాయింట్లకు చేరిన గాలి నాణ్యతా సూచీ

2 Nov, 2023 10:30 IST|Sakshi

ఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరింది. ఢిల్లీలోని ముంద్ఖా ప్రాంతంలో గురువారం గాలినాణ్యతా ప్రమాణాలు తీవ్ర స్థాయికి చేరాయి. నాణ్యతా ప్రమాణాల సూచీలో అత్యధికంగా 616 పాయింట్లకు పడిపోయిందని అధికారులు తెలిపారు. గత ఐదు రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. బుధవారం ఉష్ణోగ్రత అత్యధికంగా 32.7 డిగ్రీలుగా నమోదైంది.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం ఢిల్లీ మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) రాత్రి 7 గంటలకు 357 వద్ద నమోదైంది. దీంతో ఢిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపరచడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ అటవీ శాఖకు హైకోర్టు ఆదేశించింది. కలుషిత గాలి పీల్చడం వల్ల అస్తమా రోగుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. 

గాలి నాణ్యత సూచిలో 0-50 ఉంటే ఆరోగ్యమైన గాలి ఉన్నట్లు, 50-100 ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్లు భావిస్తారు. 101-200 ఉంటే మధ్యస్థంగా, 201-300 పేలవంగా ఉన్నట్లు గణిస్తారు. 301-400 ఉంటే అత్యంత పేలవంగా, 401-500 ఉంటే తీవ్ర స్థాయిలో గాలి నాణ్యతా ప్రమాణాలు ఉన్నట్లు భావిస్తారు. 

ఇదీ చదవండి: లిక్కర్‌ కేసులో నేడు ఈడీ ఎదుటకు సీఎం కేజ్రీవాల్‌


 

మరిన్ని వార్తలు