కజక్ అధ్యక్షుడికి మోదీ ప్రత్యేక కానుక

8 Jul, 2015 11:52 IST|Sakshi
కజక్ అధ్యక్షుడికి మోదీ ప్రత్యేక కానుక

అస్టానా: భారత ప్రధాని నరేంద్ర మోదీ కజకిస్థాన్ అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్బయేవ్తో బుధవారం భేటీ అయ్యారు. భారత్లోని మతాలకు సంబంధించిన గ్రంథాలను మోదీ ఈ సందర్భంగా నూర్ సుల్తాన్కు బహూకరించారు. వాల్మీకి రామాయణంతో పాటు ఇంగ్లీష్లోకి అనువదించిన గురు గ్రంథ్ సాహెబ్, జైన, బుద్ధ మత విశ్వాసాలకు సంబంధించిన పుస్తకాలను అందజేశారు. 2003 నుంచి నూర్ సుల్తాన్ ప్రతి మూడేళ్లకోసారి ప్రపంచ సాంప్రదాయ మతాల గురువుల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో మోదీ కజక్ అధ్యక్షుడికి ప్రత్యేక కానుకగా పుస్తకాలు అందజేశారు.  

ఆరు దేశాల పర్యటనకు వెళ్లిన మోదీ ప్రస్తుతం కజకిస్థాన్లో ఉన్నారు. ఈ రోజు మోదీ రష్యా పర్యటనకు వెళతారు. అక్కడ జరిగే బ్రిక్స్, ఎస్సీఓ సదస్సుల్లో పాల్గొంటారు.
 

మరిన్ని వార్తలు