పాక్ ప్రధానిపై హత్యకేసు నమోదు

17 Sep, 2014 14:33 IST|Sakshi
పాక్ ప్రధానిపై హత్యకేసు నమోదు

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సహా పలువురు మంత్రులపై అక్కడి పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్న నిరసనకారులను చంపినందుకు ఈ కేసు నమోదైనట్లు న్యాయవాదులు తెలిపారు. ప్రధానమంత్రి సహా మరో 11 మంది ఉన్నతాధికారులు, హోం మంత్రి, రైల్వే మంత్రి, నగర కమిషనర్, పోలీసు చీఫ్ తదితరులపై హత్య కేసు నమోదు చేయాల్సిందిగా స్థానిక కోర్టు ఒకటి పోలీసులను ఆదేశించింది.

ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరిగిన ప్రదర్శనల సందర్భంగా తమ కార్యకర్తలు ఇద్దరు మరణించారని, దీనిపై కేసు నమోదు చేయాలని కోరుతూ పాకిస్థాన్ అవామీ తెహరీక్ (పీఏటీ) నాయకుడు తహిరుల్ ఖాద్రీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవానికి ఆ సందర్భంగా జరిగిన గొడవల్లో దాదాపు 500 మందికి పైగా మరణించారు. వారిలో కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు