తొలి అంతరిక్ష హెలికాప్టర్‌ ‘ఇంజెన్యూటీ’

1 May, 2020 05:01 IST|Sakshi

వాషింగ్టన్‌: అరుణగ్రహంపైకి తాము పంపించే తొలి హెలికాప్టర్‌కు భారత సంతతికి చెందిన పదిహేడేళ్ళ బాలిక వనీజా రూపానీ సూచించిన పేరును  అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ సెలక్ట్‌చేసింది. ఈ హెలికాప్టర్‌ అంతరిక్ష నౌక తో పాటు ప్రయాణం చేస్తుంది అని నాసా ట్వీట్‌ చేసింది. అంతరిక్ష నౌక పర్సెవరెన్స్, ఇంజెన్యూటీలను జూలైలో నాసా అంతరిక్షంలోకి పంపనుంది. చిన్నప్పటినుంచి రూపానీకి అంతరిక్ష శాస్త్రం పై ప్రత్యేక ఆసక్తి ఉండేదని ఆమె తల్లి నౌషీన్‌ రూపానీ చెప్పారు.

మరిన్ని వార్తలు