అవును అణుపరీక్షలే: ఉత్తరకొరియా

9 Sep, 2016 10:48 IST|Sakshi
అవును అణుపరీక్షలే: ఉత్తరకొరియా

ప్యాంగ్యాంగ్:: అణుపరీక్షలను ధృవీకరిస్తూ ఉత్తర కొరియా ప్రకటన చేసింది. ఉత్తర కొరియా తన ఐదో అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని ఆ దేశ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఉత్తర కొరియా న్యూక్లియర్ టెస్ట్ సైట్లో 5.3 తీవ్రతతో సంభవించిన భూకంపాన్ని అణుపరీక్షలుగా ప్రపంచదేశాలు అనుమానించిన నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ ప్రకటనను చేసింది. ఉత్తర కొరియా నిర్వహించిన అనుపరీక్షలలో ఇదే అత్యంత శక్తివంతమైనదని దక్షిణ కొరియా వెల్లడించింది.

కొత్తగా అభివృద్ధి చేసిన వార్హెడ్తో దేశ ఉత్తర ప్రాంతంలోని న్యూక్లియర్ టెస్ట్ సైట్ నుంచి శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. విజయవంతంగా పరీక్షలు నిర్వహించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపింది. కాగా ఉత్తర కొరియా చర్యపై ప్రపంచ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర కొరియా స్వీయ విధ్వంసానికి పాల్పడుతోందని దక్షిణ కొరియా విమర్శించింది.
 

మరిన్ని వార్తలు