సౌదీ అరేబియా చారిత్రాత్మక నిర్ణయం

16 Dec, 2017 20:02 IST|Sakshi

రియాద్‌ : సౌదీ అరేబియాలో మహిళలకు భారీ ఊరట లభించింది. ఇక నుంచి వారు కూడా డ్రైవింగ్‌ చేసేందుకు అనుమతి లభించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొద్దికొద్దిగా మార్పులను ఆహ్వానిస్తున్న సౌదీ తాజాగా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బైక్‌ల నుంచి ట్రక్కుల వరకు మహిళలు డ్రైవింగ్‌ చేసేందుకు వీలుకల్పించాలని నిర్ణయించాం. ఇది జూన్‌ నుంచి అమలులోకి రానుంది' అని సౌదీ ప్రభుత్వం పేర్కొంది. గతంలోనే సౌదీ రాజు సల్మాన్‌ ఈ విషయం చెప్పిన విషయం తెలిసిందే.

దీంతో ఇక నుంచి మహిళలు కూడా పురుషులతో సమానంగా ఎలాంటి భేదాలు లేకుండా బైక్‌లపై దూసుకెళ్లనున్నారు. కాగా, మహిళలకు ప్రత్యేక లైసెన్స్‌ ప్లేటులు ఉండవని, అయితే, వారు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు, రోడ్డు ప్రమాదాలకు పాల్పడినా వారి కేసులు విచారించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలో ఒక్క సౌదీ అరేబియా మాత్రమే మహిళల డ్రైవింగ్‌పై ఇప్పటి వరకు నిషేధం కొనసాగించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు