దుబాయ్లోని భారతీయులతో మోదీ

17 Aug, 2015 10:25 IST|Sakshi

అబుదాబి :  రెండు  రోజుల  విదేశీ పర్యటన కోసం దుబాయ్  వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  టూర్  కొనసాగుతోంది  దీంట్లో  భాగంగా మోదీ దుబాయ్‌లోని అంతర్జాతీయ మైదానంలో ప్రసంగించనున్నారు.  సోమవారం ఆయన  జీరో కార్బన్ సిటీ(మాస్‌దర్ సిటీ)ని సందర్శిస్తారు.  అక్కడి వాణిజ్య ప్రముఖులతో మోడీ సమావేశం కానున్నారు. వాణిజ్యం, భద్రత, ఉగ్రవాదం విదేశీ వ్యవహారాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. 

 

ముఖ్యంగా  అండర్ వరల్డ్  డాన్ దావూద్ ఇబ్రహీం అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం మధ్యాహ్నం విందు తర్వాత  అంతర్జాతీయ వేదికపై భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు.  అయితే ఈ వేదిక  సామర్ధ్యం నలభైవేల మందికే అయినప్పటికీ, ఇప్పటికే  యాభైవేలమంది ఈ సమావేశానికి హాజరయ్యేందుకు తన పేర్లను నమోదు చేసుకున్నారని సమాచారం.  

తన పర్యటనలో భాగంగా  మోడీ ఆదివారం రాత్రి  అక్కడి ప్రఖ్యాతి  షేక్ జాయేద్ మసీదును సందర్శించారు. భారత్  సహా వివిధ దేశాలనుంచి  మార్బుల్స్తో   నిర్మించిన  మసీదు దగ్గర ఆయన ఎప్పటిలాగానే సెల్పీలతో సందడి చేశారు.  రెండు దేశాల మధ్య వాణిజ్య   ద్వైపాక్షిక  సంబంధాలను మెరుగుపర్చుకోవడమే  తన పర్యటన ఉద్దేశమని ప్రధాని మోదీ తెలిపారు.   దుబాయ్ తనకు మినీ ఇండియా లాంటిదని అభివర్ణించారు.కాగా ప్రధాని నరేంద్రమోడీ యూఏఈలో  రెండురోజుల  పర్యటన ఈ రోజుతో ముగియనుంది.

 

మరిన్ని వార్తలు