‘ప్రత్యేక రవాణా శాఖను ఏర్పాటు చేస్తాం’ | Sakshi
Sakshi News home page

‘ప్రత్యేక రవాణా శాఖను ఏర్పాటు చేస్తాం’

Published Mon, Aug 17 2015 10:16 AM

Preparing proposal for separate transport department, says Nitin Gadkari

న్యూఢిల్లీ: మోటారు వాహనాల సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా రవాణా శాఖను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఆదివారం వెల్లడించారు. తమ శాఖ నుంచి రవాణా శాఖను వేరు చేసి ప్రత్యేకంగా కార్యదర్శిని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

దీనికి సంబంధించిన ప్రతిపాదనను త్వరలో కేబినెట్, ప్రధాని ఆమోదం కోసం పంపుతామని పేర్కొన్నారు. మోటారు వాహన సంబంధింత సమస్యలైన ఇంధన సాంకేతికత, ఉద్గారాల తగ్గింపు  తదితరాల పరిష్కారానికి ఈ ప్రతిపాదన ఉద్దేశించినదని చెప్పారు గత ఏడాదితో పోల్చితే వాహనాల రిజిస్ట్రేషన్ ఈసారి 8.68 శాతం పెరిగిందన్నారు.  
 

Advertisement
Advertisement