కర్తార్‌పూర్‌ వీడియోలో ఖలిస్తాన్‌ నేతలు?

7 Nov, 2019 08:30 IST|Sakshi

లాహోర్‌: సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ 550వ జయంతి వేడుకల సందర్భంగా పాకిస్థాన్‌ విడుదల చేసిన ఒక వీడియోలో ఖలిస్తాన్‌ నేతలు ఉండటం వివాదమైంది. ఆపరేషన్‌ బ్లూస్టార్‌ (1984)లో మరణించిన భింద్రన్‌వాలే, అతడి మిలటరీ సలహాదారు షాబేగ్‌ సింగ్‌లు ఉన్న వీడియోను పాకిస్థాన్‌ సోమవారం విడుదల చేసింది. ఖలిస్తాన్‌ ఉద్యమానికి అనుకూలంగా ఉన్న సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ బ్యానర్‌ ఈ వీడియోలో ఉండటం గమనార్హం. సరిహద్దు వెంట పంజాబ్‌లోని బాబా నానక్‌ గుడిని.. పాకిస్థాన్‌వైపు ఉన్న కర్తార్‌పూర్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను కలుపుతూ నిర్మించిన కర్తార్‌పూర్‌ కారిడార్‌ త్వరలో మొదలుకానున్న నేపథ్యంలో ఈ వీడియో విడుదల వివాదమైంది.

మరిన్ని వార్తలు