పాక్ లో ఆత్మాహుతి దాడి.. మంత్రి సహా 9 మంది మృతి

16 Aug, 2015 15:30 IST|Sakshi
పాక్ లో ఆత్మాహుతి దాడి.. మంత్రి సహా 9 మంది మృతి

పాకిస్థాన్ : పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్లో ఆత్మాహుతి దాడిలో హోం మంత్రి షుజా ఖాన్జాదా మరణించారు. ఆదివారం అటోక్ జిల్లాలో మంత్రి నివాసం వద్ద జరిగిన ఈ దాడిలో మంత్రితో సహా 9 మంది మరణించారు.  మరో 24  మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నతాధికారులు వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడు దాటికి కార్యాలయంలోని పైకప్పు కుప్పకూలిపోయింది.

గతేడాది ఆక్టోబర్లో  షుజా హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తీవ్రవాదులు, వారి సంస్థలపై షుజా ఉక్కుపాదంతో అణిచి వేశారు. ఈ నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు