తప్పుడు ట్వీట్‌పై స్పందించిన పోర్న్‌ స్టార్‌

4 Sep, 2019 14:41 IST|Sakshi
బషీత్‌ తప్పిదాన్ని పసిగట్టిన పాకిస్తాన్‌ జర్నలిస్టు నైనా ఇనాయత్‌

ఇస్లామాబాద్‌ : కశ్మీర్‌లో ప్రజల పరిస్థితి దారుణంగా ఉందని భారత్‌పై బురదజల్లేందుకు యత్నించిన పాకిస్తాన్‌ మాజీ హైకమిషనర్‌ అబ్దుల్‌ బసిత్‌ నవ్వుల పాలయ్యారు. కశ్మీర్‌లో యూసుఫ్‌ అనే వ్యక్తి బుల్లెట్‌ గాయాలతో కంటిచూపు కోల్పోయాడని పేర్కొంటూ పోర్న్‌ స్టార్‌ జానీ సిన్స్‌ ఫోటోను ఆయన షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో తప్పిదాన్ని గ్రహించిన బసిత్‌ ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు. అయితే, అప్పటికే అది వైరల్‌ అయింది.

ఇక ఈ వ్యవహారంపై సదరు పోర్న్‌ స్టార్‌ స్పందించారు. పాకిస్తాన్‌ మాజీ హైకమిషనర్‌ తన ఫొటోను తప్పుగా పేర్కొనడంతో సోషల్‌ మీడియాలో బాగా ప్రచారం లభించిందని జానీ సిన్స్‌ చెప్పాడు. ‘బసిత్‌ చేసిన పని నాకు ఎక్కడా లేని ప్రచారం తెచ్చిపెట్టింది. ట్విటర్‌లో ఫాలోవర్స్‌ పెరిగారు. కానీ, అతను చేసింది సరైంది కాదు. నాకైతే కంటి చూపు బాగానే ఉంది. బసిత్‌ తన దృష్టి లోపాన్ని సరిచేసుకుంటే మంచిది’ అని ట్వీట్‌ చేశాడు.

(చదవండి : మరోసారి బయటపడ్డ పాక్‌ చిల్లర వేషాలు..!)

మరిన్ని వార్తలు