పవర్ టేబుల్ భళా..!

20 May, 2014 02:38 IST|Sakshi
పవర్ టేబుల్ భళా..!

మీటర్ వ్యాసం, 1.2 మీటర్ల ఎత్తున్న ఈ టేబుల్ మధ్యభాగంలో పచ్చగా ఉన్న ప్రాంతాన్ని చూడండి. అది కేవలం డిజైన్ కాదు.. పక్కనే ఉన్న టేబుల్ ల్యాంప్‌కు విద్యుత్తును అందివ్వగల బయో ఫొటో వోల్టాయిక్ ఫార్మ్. ఆ ప్రాంతంలో కొన్ని రకాల సూక్ష్మస్థాయి మొక్కలు, బ్యాక్టీరియా, నాచు వంటివి ఉంటాయి. అవి వెలుతురు, కార్బన్ డయాక్సైడ్‌లను ఉపయోగించుకుని కిరణజన్య సంయోగక్రియ ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఆ శక్తిని నిల్వ చేసుకుని, అవసరమైనప్పుడు ఉపయోగించుకునేందుకు తగిన ఏర్పాట్లూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ టేబుల్ ద్వారా పది డిజిటల్ గడియారాలకు అవసరమైనంత విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. సామర్థ్యం మరింత పెంచితే ల్యాప్‌టాప్‌లు, టేబుల్ లైట్లను కూడా దీంతో పనిచేయించుకోవచ్చు. ఈ ‘మాస్’ టేబుల్ త్వరలో అందుబాటులోకి రానుంది.

మరిన్ని వార్తలు