కదలకుండా అదే స్థానంలో ఏడేళ్లు ఎలా?

9 Feb, 2020 17:42 IST|Sakshi

ఏదైనా జీవి కదలకుండా ఉందంటే దానిని రెండు సార్లు పరిశీలిస్తాం. ఒకవేళ అప్పటికి కదలకుండా ఉంటే అది చనిపోయిందని భావిస్తాం. కానీ ఇక్కడ ఉన్న సాలమండర్(బల్లి జాతి) మాత్రం చాలా తెలివైనది. ఎంతలా అంటే ఏడు సంవత్సరాలుగా చనిపోయిన దానిలా నటిస్తూ అలాగే కదలకుండా ఉండిపోయింది. వినడానకి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఒక గుహలో ఉంటున్న ఈ సాలమండర్‌ ఏడు సంవత్సరాల క్రితం ఏ స్థానంలో ఉందో ఇప్పుడు కూడా అదే స్థానంలో ఉండడం విశేషం.అయితే ఆహారం లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా ఉంటుంది, పైగా ఒక్క అంగుళం కదలకుండా ఎలా ఉంటుందనే డౌటు మీకు వచ్చే ఉంటుంది. కానీ అసలు విషయం అక్కడే ఉందటున్నారు దానిని పరీక్షించిన శాస్త్రవేత్తలు.

అదేంటంటే... సాలమండర్‌లు దాదాపు 100 సంవత్సరాలు బతకగలవు. సాలమండర్‌ ఆహారం లేకున్నా తన చిన్న శరీరంలో విడుదలయ్యే ఎంజైమ్‌ ద్వారా అది తినకుండా అలాగే ఉండిపోతుందట. అందుకే అవి ఆహారం లేకుండా కొన్ని సంవత్సరాలు జీవించేయగలవు. దీంతో పాటు ఇవి మహా బద్దకస్తులు.. ఎంతలా అంటే ఒక అంగుళం కూడా ముందుకు కదలకుండా ఉన్న స్థానంలోనే కొన్ని సంవత్సరాల పాటు కదలకుండా అలాగే ఉండిపోతాయి. కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం అది కొన్నాళ్ల పాటు నిద్రాణవస్థలో ఉంటుందని, అందుకే అది అలా కదలకుండా ఉండిపోతుందని పేర్కొన్నారు. ఏదైతేనేం.. అసలు ఏడు సంవత్సరాల నుంచి అదే స్థానంలో ఉంటూ అంగుళం కూడా కదలకుండా ఉన్న సాలమండర్‌ను మెచ్చుకొని తీరాల్సిందే.

మరిన్ని వార్తలు