Foxglove అందమైన ఈ పువ్వులతో..హార్ట్‌ ఎటాక్‌ ముప్పు !

17 Oct, 2023 14:42 IST|Sakshi

అందమైన పువ్వుల్ని చూడగానే మన ముఖంలో అనుకోకుండా చిరు నవ్వులు పూస్తాయి. ఒక్కోసారి అలాంటి మొక్కల్ని మన గార్డెన్‌లో కూడా పెంచుకోవాలని ఉబలాటపడతాం. ఇకపై ఇలాంటి ప్రయత్నాలకు కొంచెం ఆలోచన జోడించాల్సిందే! ఎందుకంటే  కొన్ని రకాల పువ్వులు  మనుషుల్లో  గుండెపోటుకు  కారణమవుతుందని  నిపుణులు తాజాగా హెచ్చరి స్తున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ప్రియమైన గార్డెన్ ఫేవరెట్‌గా పేరొందిన ఫాక్స్‌గ్లోవ్ పుష్పాలపై  సైంటిస్టులు కీలకహెచ్చరికలు  చేశారు.  ఇది  యూరప్ ఆసియాకు చెందిన తీగ జాతి మొక్క. ఈ మొక్కను "డెడ్ మ్యాన్స్ బెల్స్" లేదా "మంత్రగత్తెల చేతి తొడుగులు" అనే పేరుతో  విక్రయిస్తారట. సాధారణ ఫాక్స్ గ్లోవ్ (డిజిటాలిస్ పర్పురియా) మొక్క పువ్వులు పింక్, పర్పుల్, తెలుపు, పసుపు ఇలా పలు రంగుల్లో ఉంటాయి. పెండ్యులస్, ట్రంపెట్ ఆకారలో  గుత్తుల గుత్తుల పువ్వులు మంత్రముగ్ధులను చేస్తాయి. అమెరికాలో  ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. 

అయితే ఫాక్స్‌గ్లోవ్ అందమైన పువ్వుల్ని ఇవ్వడమే కాదు, గుండెపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపే ఒక రకమైన కార్డియాక్ గ్లైకోసైడ్‌గా ఉండే డిగోక్సిన్ వంటి శక్తివంతమైన సమ్మేళనాల్ని  కూడా కలిగి ఉంటాయి.  ఇవి గుండె కండరాల పనితీరును ప్రభావితం చేస్తాయని  బఫెలో, స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్, డాక్టర్ జెన్ వాంగ్ లైవ్ సైన్స్‌తో చెప్పారు. ఆరోగ్యకరమైన గుండె వేలకొద్దీ కార్డియాక్ కణాల ద్వారా రక్తాన్ని శరీరానికి పంపిస్తుంది. వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ గా పిలిచే గుండె లయకు డిగోక్సిన్‌తో ఉన్నట్టుండి అంతరాయం ఏర్పడితే రసాయన సమస్యలు తలెత్తుతాయి. గుండె చాలా వేగంగా కొట్టుకుంది. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్ లేదా, మరణానికి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. ఎవరైనా పొరపాటున మొక్కలోని ఏదైనా భాగాన్ని తీసుకుంటే, వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని ఆయన సూచించారు. 

ఫాక్స్‌గ్లోవ్ “చనిపోయినవారిని తిరిగి బతికించగలు. జీవించి ఉన్నవారిని చంపగలదు” అనేది పాత  ఆంగ్ల సామెత. ఫాక్స్‌ గ్లోవ్‌లో అంతటి  గొప్ప, ప్రాణాలను రక్షించే ఔషధ ఉపయోగాలు కూడా ఉన్నాయట. ఇదే విషయాన్ని డాక్టర్ వాంగ్ కూడా చెప్పారు. ఫాక్స్‌గ్లోవ్స్‌లోని డిగోక్సిన్‌ తో ప్రాణాంతక ప్రభావాలు ఉన్నప్పటికీ - డిగోక్సిన్  విలువైన గుండె మందులాగా చాలా పాపులర్‌ అని, ఇతర మందులేవీ పనిచేయనపుడు  గుండె వైఫల్య చికిత్సలో  ఇది బాగా పనిచేస్తుందని సూచించారు.

మరిన్ని వార్తలు