శరణార్థులకు స్వాగతం!

22 Feb, 2017 13:09 IST|Sakshi
శరణార్థులకు స్వాగతం!

న్యూయార్క్: అమెరికా ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రానికి ప్రతీకగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ వద్ద శరణార్థులకు స్వాగతం అంటూ మంగళవారం ఓ బ్యానర్ వెలిసింది. బ్యానర్ను గమనించిన వెంటనే నేషనల్ పార్క్ రేంజర్స్ దానిని తొలగించారు. అయితే.. అప్పటికే దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి. దేశాధ్యక్షుడు ట్రంప్ వలస వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలో.. కనిపించిన ఈ బ్యానర్పై నెటీజన్లు పాజిటీవ్గా స్పందించారు.

ఈ బ్యానర్ను తామే ఏర్పాటు చేశామని ఆల్ట్ లేడీ లిబర్టీ అనే సంస్థ ప్రకటించుకుంది. ఈ మేయిల్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో.. 'దాదాపు అమెరికన్లందరి పూర్వికులు వేరువేరు ప్రాంతాలకు చెందినవారు. వలసదారులు, శరణార్థులే ఈ దేశాన్ని గొప్పగా మార్చారు. అంతేగానీ వలస వ్యతిరేక విధానాలు ఈ దేశాన్ని గొప్పగా చేయవు. ముస్లింలు, శరణార్థులు, వలసదారులు అందరూ దేశంలోకి ఆహ్వానితులే' అని ఆల్ట్ లేడీ లిబర్టీ గ్రూప్ వెల్లడించింది. అలాగే..దేశాల మధ్య గోడలు, మత ప్రాతిపదికన నిషేధం విధించడం లాంటివి మన విలువలకు వ్యతిరేకం అని ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు