ఇజ్రాయెల్పై రాకెట్లతో దాడి

30 Jun, 2014 16:23 IST|Sakshi

జెరూసలెం: పాలస్తీనా ఉగ్రవాదులకు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య భీకర పోరు జరుగుతోంది. పాలస్తీనా ఉగ్రవాదులు సోమవారం ఇజ్రాయెల్పై రాకెట్లతో దాడి చేశారు. పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంపై పది పేలుడు పదార్థాలను ప్రయోగించినట్టు ఓ వార్త సంస్థ తెలపగా.. ఆదివారం రాత్రి కనీసం 16 రాకెట్లతో దాడి చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టేందుకు ప్రతీకార దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రకటించింది. గాజాలోని ఉగ్రవాదుల స్థావరం లక్ష్యంగా చేసుకున్న్టట్టు తెలిపారు. రాకెట్లతో దాడి చేసేందుకు చేస్తున్న సన్నాహకాలు చివరిదశకు వచ్చాయని సైనికాధికారులు చెప్పారు. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఓ ఉగ్రవాది మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారని పాలస్తీనా వర్గాలు తెలిపాయి. గాజా దక్షిణప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇజ్రాయెల్ సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

>
మరిన్ని వార్తలు