భారత్‌ ఎన్నికల్లో రష్యా జోక్యం

3 Aug, 2018 07:59 IST|Sakshi

వాషింగ్టన్‌ : భారత్‌, బ్రెజిల్‌ దేశాల ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోనుందనే రిపోర్టు సంచలనం సృష్టిస్తోంది. ఇరు దేశాల్లోని మీడియాను టార్గెట్‌ చేయడం ద్వారా రష్యా ఎన్నికలను ప్రభావితం చేయబోతోందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సోషల్‌మీడియా నిపుణుడు ఒకరు అమెరికా చట్టసభలకు వెల్లడించారు.

సెనేట్‌ ఇంటిలిజెన్స్‌ కమిటీ హియరింగ్‌కు హాజరైన ఫిలిప్‌ ఎన్‌. హోవర్డ్‌ ‘సోషల్‌మీడియాపై విదేశాల ప్రభావం’ అనే అంశం గురించి మాట్లాడారు. భారత్‌, బ్రెజిల్‌లలో మీడియా అంతగా ప్రొఫెషనల్‌గా ఉండదని, దీని వల్ల రష్యా వారిపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఫిలిప్‌ వ్యాఖ్యానించారు. ఇందుకు హంగేరి మీడియా ఉదంతాన్ని ఉదహరించారు.

కాగా, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు 2017లో అమెరికా ఇంటిలిజెన్స్‌ అధికారి రష్యా జోక్యాన్ని బయటపెట్టారు.

>
మరిన్ని వార్తలు