2024 తర్వాతా పుతినే అధ్యక్షుడు

12 Mar, 2020 04:34 IST|Sakshi
వ్లాదిమిర్‌ పుతిన్‌

సవరణలకు పార్లమెంట్‌ ఆమోదం

మాస్కో: రష్యా అధ్యక్షుడిగా మరింత కాలం కొనసాగేందుకు వ్లాదిమిర్‌ పుతిన్‌ మార్గాన్ని సుగమం చేసుకున్నారు. పుతిన్‌ ప్రస్తుత అధ్యక్ష పదవీ కాలం 2024లో ముగియనుంది. ఆ తర్వాతా మరో 12ఏళ్లు తనే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వీలుగా చేసిన రాజ్యాంగ సవరణలను రష్యా పార్లమెంట్‌ బుధవారం ఆమోదించింది. దిగువ సభ ‘ద స్టేట్‌ డ్యూమా’ రాజ్యాంగంలో చేసిన పలు సవరణలకు  ఓకే చెప్పింది. ఈ సవరణలకు 383 అనుకూల ఓట్లు లభించగా ఏ ఒక్క పార్లమెంటు సభ్యుడు వ్యతిరేకించకపోవడం గమనార్హం. కాకపోతే 43 మంది సభకు దూరంగా ఉన్నారు. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ సవరణలు అన్నింటికీ ఎగువ సభ ఫెడరేషన్‌ కౌన్సిల్‌ ఆమోద ముద్ర వేసింది. ఏప్రిల్‌ 22న దేశవ్యాప్తంగా ఈ సవరణలపై ఓటింగ్‌ జరగనుంది. అంతకంటే ముందు రష్యా రాజ్యాంగ న్యాయస్థానం ఈ సవరణలను సమీక్షించనుంది. మాజీ కేజీబీ అధికారి అయిన వ్లాదిమిర్‌ పుతిన్‌ 20 ఏళ్లుగా రష్యా రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగిస్తుండటం తెల్సిందే.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా