ఆకాశంలో అద్భుతం : ఏలియన్స్‌ అని భయాందోళన

20 Jan, 2018 15:37 IST|Sakshi
రష్యాలో ప్రజలను భయాందోళనలకు గురి చేసిన దృశ్యం

ఉత్తర ధ్రువ వెలుగు లేదా రాకెట్ ఇంధనమే కారణమన్న రష్యన్‌ మీడియా

2009లో నార్వేలో కూడా ఇలానే

గుర్తు తెలియని ఎగిరే వస్తువు(యూఎఫ్‌ఓ)గా భావించిన రష్యన్లు

సైబీరియా, రష్యా : అర్ధరాత్రి కావొస్తోంది. ఒక్కసారిగా ఆకాశంలో భారీ వెలుగు. ఏం జరుగుతుందో ఉత్తర సైబీరియా ప్రజలకు అర్థం కాలేదు. గుండ్రటి ఆకారంలో ఆకాశం నుంచి పెద్ద వెలుగు ఏర్పడటాన్ని అందరూ గుర్తించారు. ఆ దృశ్యాలను ఫోన్లలో బంధించారు. ఏలియన్లు రష్యాలో దిగుతున్నాయంటూ సోషల్‌మీడియాలో కొందరు పోస్టులు చేశారు. దీంతో కొందరు సైబీరియన్లు భయంతో వణికిపోయారు.

ఈలోగా ఆకాశంలో వచ్చిన వెలుగు మిలటరీ చేసిన రాకెట్‌ ప్రయోగం వల్ల ఏర్పడి ఉండొచ్చిన లేదా ఉత్తర ధ్రువం నుంచి వచ్చే వెలుగు కావొచ్చని, ప్రజలు భయాందోళనలకు గురికావొద్దంటూ రష్యన్‌ కథనాలను ప్రసారం చేయడంతో వారందరూ ఊపరిపీల్చుకున్నారు.

నాలుగు రాకెట్లను ఒకేసారి ప్రయోగించడంతో వాటి ఇంధన ప్రభావం వల్ల ఆకాశం మిరుమిట్లు గొలుపుతూ దర్శనం ఇచ్చినట్లు చెబుతున్నారు. 2009లో నార్వే కూడా అర్థరాత్రి ప్రయోగాలు నిర్వహించడంతో ఆ ప్రదేశంలోని ఆకాశం మిరుమిట్లు గొలుపుతూ కనిపించింది. 

మరిన్ని వార్తలు