'మేం దిగితే ఉత్తర కొరియాకు దుర్దినమే'

8 Sep, 2017 20:04 IST|Sakshi

వాషింగ్టన్‌: ఉత్తర కొరియాపై సైనిక చర్య చేపట్టడం తమ ఉద్దేశం కాదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఒక వేళ తాము ఆ పని చేపట్టిన రోజు మాత్రం ఉత్తర కొరియాకు దుర్దినం అవుతుందని, ఆ రోజును వారు ఎప్పటికీ మర్చిపోలేరని బెదరగొట్టారు. తాజాగా ఉత్తర కొరియా ఆరోసారి అణ్వాయుధాల పరీక్షలు చేపట్టిన నేపథ్యంలో అమెరికా సైనిక చర్య చేపట్టనుందా అనే అంశంపై ఆయన ఈవిధంగా క్లారిటీ ఇచ్చారు.

అమెరికా ఉన్న పలంగా ఉత్తర కొరియాకు ఆర్థిక పరంగా విడుదల చేయాల్సినవి ఎందుకు ఆపేసిందని ప్రశ్నించగా ఆ దేశం చాలా చెడుగా ప్రవర్తిస్తుందని, అందుకే వాటిని ఆపేశామని అన్నారు. 'సైనిక చర్య కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఉంది. అయితే, ఆహ్వానించదగినదా? ఏ మాత్రం కాదు?. మిలటరీ యాక్షన్ ద్వారా నేను ముందుకు వెళ్లాలని అనుకోవడం లేదు. అదే జరిగితే ఉత్తర కొరియాకు దుర్దినమే' అని ట్రంప్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు