ప్రత్యేకంగా కరోనా సమాధులు.. అక్కడి నుంచి స్పష్టంగా

14 Mar, 2020 14:04 IST|Sakshi

కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్‌ వ్యాప్తి ప్రస్తుతం అక్కడ కొంత తగ్గుముఖం పట్టగా.. ఇరాన్‌లో మాత్రం విజృంభిస్తోంది. ఇరాన్‌ ప్రభుత్వం అధికారికంగా 429 మంది మాత్రమే తమ దేశంలో చనిపోయారని చెబుతున్నా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఇరాన్‌లో సమాధులు తవ్వుతున్నారు. కాగా.. ఇరాన్‌లో ఇప్పటికే 10, 075 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. చదవండి: మరణాలు 5 వేలు.. కేసులు 1.34 లక్షలు

చైనాలో వెలుగు చూసిన కరోనా ప్రస్తుతం చైనాకు వెలుపల ఇరాన్‌లో ఎక్కువగా ప్రభావం చూపుతోంది. తాజాగా కొన్ని అంతర్జాతీయ మీడియా ఛానళ్లు చూపించిన వాటి ప్రకారం ఇరాన్ రాజధాని టెహరాన్‌కు 145 కి.మీ. దూరంలోని కోమ్ సిటీ వద్ద కరోనా సమాధులు తవ్వుతున్నారు. కరోనా మృతులను విడివిడిగా కాకుండా సామూహికంగా ఖననం చేశారు. ఒక్కో సమాధి 100 గజాల పొడవు ఉంది. ఈ సమాధులు అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కొన్ని శాటిలైట్ చిత్రాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో పాత సమాధులను పూడ్చి కొత్తగా తవ్వుతున్నట్లు కనిపిస్తోంది.  కాగా.. ఇరాన్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఆ దేశం ప్రపంచ బ్యాంకును భారీ సాయం కోరుతోంది. చదవండి: కరోనా కల్లోలం: అక్కడ పిట్టల్లా రాలిపోతున్నారు

మరిన్ని వార్తలు