రోబో రాజకీయ నాయకుడు!

26 Nov, 2017 23:15 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ప్రపంచానికి తెలియని కొత్తకొత్త విషయాలను తెలిపే శాస్త్రవేత్తలు.. మరొక అడుగు ముందుకు ఏకంగా రోబో రాజకీయ నాయుకుడ్ని తయారు చేశారు. ప్రంచంలోనే మొదటిసారిగా కృత్రిమ మేథస్సుతో ఈ రాజకీయ నాయకుడు రూపుదిద్దుకున్నాడు. ఏవైనా స్థానిక అంశాలు, పథకాలు, విద్య, వలసలు వంటి వాటిపై సందేహాలు అడిగితే వెంటనే టక్కున జవాబులు కూడా చెపుతాడట.

న్యూజిలాండ్‌కు చెందిన  49ఏళ్ల నిక్‌ గిరిస్టన్‌  ఈ వర్చువల్‌ పొలిటీషన్‌ తయారుచేసి, సామ్‌గా నామకరణం చేశాడు. అయితే సామ్‌కు చాలా అంశాలపై శిక్షణ ఇవ్వాల్సి ఉందని, అన్ని దేశాలకు సంబంధించిన విషయాలు, వివిధ రకాల సమస్యాత్మక అంశాలు, వాతావరణ మార్పులు, సమానత్వం వంటివి కూడా నేర్పాల్సి ఉందన్నాడు. ఈ ఏ1 పొలిటీషియన్‌ ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారికి సమాధానాలిస్తూ వారి నుంచి కూడా కొంత నేర్చుకుంటాడట.  

మరిన్ని వార్తలు