సైన్స్‌ను రాజకీయం చేయడం దురదృష్టకరం: షి జెంగ్లీ

26 May, 2020 13:23 IST|Sakshi

బీజింగ్‌: ప్రంపచ దేశాలన్ని కరోనా ధాటికి విలవిల్లాడున్న సంగతి తెలిసిందే. ఆరు నెలల వ్యవధిలో ప్రపంచాన్ని అరవై ఏళ్ల వెనక్కు తీసుకెళ్లింది ఈ మహమ్మారి. ఈ నేపథ్యంలో కరోనా కేవలం ఆరంభం మాత్రమే అని.. వైరస్‌ల గురించి ప్రపంచ దేశాలన్ని కలసికట్టుగా పొరాటం చేయకపోతే.. ముందు ముందు మరింత భయంకరమైన పరిస్థితులను చవి చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు ‘బ్యాట్‌ ఉమెన్’‌గా ప్రసిద్ధి చెందిన షి జెంగ్లీ. వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న షి జెంగ్లీ గబ్బిలాల్లో కరోనా వ్యాప్తి గురించి పరిశోధన చేస్తున్నారు. దాంతో ఆమె బ్యాట్‌ ఉమెన్‌గా ప్రసిద్ధి చెందారు. (వూహాన్ జ‌నాభా మొత్తానికి క‌రోనా టెస్టులు)

ఈ క్రమంలో షి జెంగ్లీ మాట్లాడుతూ  ‘ఇప్పటి వరకు వైరస్‌ల గురించి మన దగ్గర చాలా తక్కువ సమాచారం ఉంది. కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తూనే ఉంటాయి.  ప్రపంచ దేశాలన్ని ఈ విషయంలో కలసి కట్టుగా పని చేయకపోతే రానున్న రోజుల్లో కరోనాను మించిన అంటు వ్యాధులు ప్రబలే అవకాశం మరింత ఎక్కువగా ఉంది’ అని హెచ్చరిస్తున్నారు షి జెంగ్లీ. అంతేకాక రాబోయే రోజుల్లో కరోనాలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే.. అడవి జంతువుల ద్వారా వ్యాప్తి చెందే వైరస్‌ల గురించి పరిశోధనలు జరిపి.. వాటి గురించి ముందుగానే ప్రపంచ దేశాలకు సమాచారం ఇవ్వాలన్నారు షి జెంగ్లీ. లేదంటే రానున్న రోజుల్లో మరింత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాక వైరస్‌లపై పరిశోధనల్లో ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు పారదర్శకంగా ఉండి ఒకరికొకరు సహకరించుకోవాలని కోరారు. సైన్స్‌ను కూడా రాజకీయం చేయడం దురదృష్టకరం అన్నారు షి జెంగ్లీ.(కరోనా వైరస్‌: మరో నమ్మలేని నిజం)

మరిన్ని వార్తలు