వంటను ప్రశ్నిస్తే చెఫ్‌ కారం కుమ్మరించాడు

24 Jan, 2017 10:11 IST|Sakshi

లండన్‌: వీకెండ్‌ అంటే యువతకు పార్టీలు షరా మాములే.. ఇలాంటి పార్టీలే భార్యభర్తలు కూడా చేసుకుంటుంటారు. కాకపోతే పబ్బులు వంటివికాదుగానీ మంచి భోజనం పెట్టే రెస్టారెంట్లకు వెళ్లి తమకు నచ్చినది తింటుంటారు. బ్రిటన్‌లోని ఓ ఇండియన్‌ రెస్టారెంట్‌లో ఇలాగే తమకు నచ్చిన ఆహారం తినేసి వద్దామనుకొని శనివారం సాయంత్రం వెళ్లిన ఓ భార్యభర్తలు విషాదాన్ని ఎదుర్కోవల్సి వచ్చింది. అది కూడా చీఫ్‌ చెఫ్‌ రూపంలో.

వంట భాగలేదని చెప్పినందుకు ఆ షెఫ్‌ హోటల్‌కు వచ్చిన వ్యక్తి భార్యను తిట్టడమే కాకుండా ప్రశ్నించిన భర్త ముఖంపై మంచి ఘాటైన కారాన్ని కుమ్మరించాడు. దీంతో అతడి కళ్లు దాదాపు పోయిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. డేవిడ్‌ ఇవాన్స్‌(46), మిషెల్లీ(47) భార్యాభర్తలు. ఇద్దరు భోదనా రంగంలో పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం హ్యపీగా భోజనం చేసేందుకు ఓ రెస్టారెంటుకు వెళ్లారు. తొలుత స్టార్టర్స్‌తో ప్రారంభించి అవి అంతభాగలేకపోయినా ఏదో కానిచ్చేశారు. ఆ తర్వాత మాంసంతో కూడిన ఆహారం వచ్చాక కూడా అది సరిగా లేకపోవడంతో అది మాత్రం పక్కకు పెట్టి మిగితా భాగం తినేశారు. పూర్తయ్యాక ఫుడ్‌ ఎలా ఉందని వెయిటర్‌ ప్రశ్నించగా మాంసం సరిగా బాయిల్‌ అవ్వలేదని, రబ్బరు మాదిరిగాఉందని, స్ట్రార్టర్స్‌ కూడా బాగా లేవని చెప్పారు. అదే విషయాన్ని చెఫ్‌కు చెప్పాడు. దీంతో అతడు వారిని తిట్టాడు. తమనెందుకు తిడుతున్నావని క్షమాపణలు చెప్పాలని డేవిడ్‌ ఇవాన్స్‌ చెఫ్‌ను అడిగాడు. ఇందుకు తిరస్కరించిన చెఫ్‌ వెంటనే డేవిడ్‌ ముఖంపై కారం కుమ్మరించాడు. దాంతో అతడి కళ్లు పోయే పరిస్థితి ఏర్పడింది.