ఈ రోడ్డుపై చార్జింగ్‌ చేసుకోవచ్చు!

18 Oct, 2018 03:31 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం స్వీడన్‌లో ఏర్పాటు  

బ్రెస్సెల్స్‌: సమీప భవిష్యత్‌లో వాహనాలన్నీ విద్యుత్‌తోనే నడుస్తాయా? శిలాజ ఇంధనాలకు విద్యుత్‌ సరైన ప్రత్యామ్నాయమా? అంటే స్వీడన్‌ పరిశోధకులు అవుననే చెబుతారు. చెప్పడమే కాదు.. రోడ్లపై వాహనాలు దూసుకెళ్లేటప్పుడు ఆటోమేటిక్‌గా చార్జింగ్‌ అయ్యేలా ప్రత్యేకమైన ట్రాక్‌ను అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించారు. స్టాక్‌హోం విమానాశ్రయం నుంచి రోజెర్స్‌బెర్గ్‌ వరకూ నిర్మించిన ఈ ట్రాక్‌ను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశమంతటా అమలు చేసేందుకు స్వీడన్‌ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. 2030 నాటికి శిలాజ ఇంధనాల వాడకాన్ని 70 శాతం తగ్గించాలని స్వీడన్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

రోడ్డు మధ్యలో విద్యుత్‌ ట్రాక్‌
ఈరోడ్‌ ఆర్లాండా, వాహనాల తయారీ సంస్థ డీఏఎఫ్, టెక్నాలజీ కంపెనీలు, విద్యాసంస్థలు, స్వీడన్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. స్టాక్‌ హోం ఎయిర్‌పోర్ట్‌ నుంచి రోజెర్స్‌బెర్గ్‌లోని ఓ సరుకుల సరఫరా కేంద్రం వరకూ దాదాపు 2 కి.మీ పొడవుతో రోడ్డు మధ్యలో ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు.  ఈ ట్రాక్‌ మధ్యలో 6 సెం.మీ లోతులో విద్యుత్‌ వైర్లను అమర్చారు. దీంతో విద్యుత్‌తో నడిచే ప్రత్యేకమైన కారు లేదా లారీ ఈ మార్గంపైకి రాగానే దాని కింద ఉండే ప్రత్యేకమైన చేయి లాంటి నిర్మాణం ఆటోమేటిక్‌గా విద్యుత్‌ ట్రాక్‌ను గుర్తించి చార్జింగ్‌ ప్రారంభిస్తుంది. ఈ మార్గంలో కారు లేదా ట్రక్కు వెళుతున్నంతవరకూ బ్యాటరీలు చార్జ్‌ అవుతూ ఉంటాయి. ఒకవేళ కారు లేదా ట్రక్కు నిలిచిపోతే, విద్యుత్‌ సరఫరా దానంతట అదే ఆగిపోతుంది. ఈ వ్యవస్థలో భాగంగా ఒక్కో వాహనం ఎంత విద్యుత్‌ను వినియోగించుకుంటుందో లెక్కించి సదరు కారు లేదా లారీ ఓనర్‌ నుంచి నగదును వసూలు చేస్తారు. దీనివల్ల విద్యుత్‌ కొరతతో వాహనాలు ఆగిపోవడమన్న సమస్యే తలెత్తదు. ఈ పైలెట్‌ ప్రాజెక్టు మొత్తం వ్యయంలో స్వీడన్‌ ప్రభుత్వం 70 శాతం భరిస్తోంది.

లాభదాయకం.. సురక్షితం
ఈ ప్రాజెక్టులో విద్యుత్‌ ట్రాక్‌ ఉన్న రోడ్డును 50 మీటర్లకు ఓ సెక్షన్‌ చొప్పున విభజిస్తారు. తద్వారా వాహనాలు సంబంధిత సెక్షన్‌లో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ విద్యుత్‌ సరఫరా జరుగుతుంది. లేదంటే ఆగిపోతుంది. దీనివల్ల గణనీయంగా ఇంధనాన్ని, శక్తిని ఆదా చేయొచ్చు. దేశమంతటా రోడ్లపై ఇలాంటి ట్రాక్‌లను పరచడం వల్ల విద్యుత్‌ వాహనాల తయారీ ఖర్చు, బ్యాటరీల పరిమాణం భారీగా తగ్గిపోతుంది. సాధారణంగా ఈ ట్రాక్‌లను ఓ కి.మీ మేర అమర్చాలంటే దాదాపు రూ.8.46 కోట్ల మేర ఖర్చవుతుంది. ఈ మొత్తం ట్రామ్‌ కారు ఏర్పాటు వ్యయంతో పోల్చుకుంటే 50 రెట్లు తక్కువ. ఇక ఈ ట్రాక్‌ల కారణంగా చార్జింగ్‌ స్టేషన్ల కోసం వాహనదారులు వెతకాల్సిన బాధ తప్పుతుంది. వరదలు సంభవించినా, రోడ్డంతా ఉప్పు ఉండిపోయినా ఉపరితలంపై విద్యుత్‌ సరఫరా ఒక ఓల్ట్‌కు మించదనీ, ప్రజలు నిక్షేపంగా చెప్పులు వేసుకోకుండా నడవొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇంధన కొరత అన్నదే లేకుండా ప్రజలు తమ వాహనాలు నడుపుకోవచ్చని హామీ ఇస్తున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పుర్రె ఎముకలు పెరుగుతున్నాయి

‘పిల్లి’మంత్రి ప్రెస్‌మీట్‌.. నవ్వలేక చచ్చిన నెటిజన్లు

కూతురి కోసం ఓ తండ్రి వింత పని..

అనుకోకుండా ఆ మొక్కను తగిలాడు అంతే..

బలవంతంగా కడుపు కోసి తీసిన బిడ్డ మృతి

అరిజోనా ఎడారిలో భారతీయ చిన్నారి మృతి

వయసు 21 చుట్టొచ్చిన దేశాలు 196

అలారం పీక నొక్కారో పీడిస్తుందంతే! 

ఆ దేశాలే బాధ్యులు

ఇమ్రాన్‌.. ఏంటిది; ఆరోగ్యం బాగాలేదేమో!

28 ఏళ్ల తరువాత.. తొలిసారి

ఓ మనిషిని ఇంత దారుణంగా చంపొచ్చా?!..

గన్నుతో తలపై నాలుగు రౌండ్లు కాల్చినా..

సిగరెట్‌ తెచ్చిన తంటా

‘వారికి తండ్రంటే ఎంతో ప్రేమ.. బతకనివ్వండి’

అమెరికాకు హువావే షాక్!

2 నౌకలపై దాడి

పాక్‌కు బుద్ధిచెప్పండి

ఎవరెస్టుపై మరణాలు రద్దీ వల్ల కాదు

శ్రీలంక ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా రువాన్‌ కులతుంగ 

జిన్‌పింగ్‌, పుతిన్‌లతో మోదీ భేటీ

కోతి చేసిన పనికి ఆ కుటుంబం..

75ఏళ్ల తర్వాత ఒక్కటైన ప్రేమజంట

పాక్‌ మీదుగా వెళ్లను

సోషల్‌ మీడియా తాజా సంచలనం

చిట్టి పెంగ్విన్లకు పెద్ద కష్టం!

భారత్‌పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్‌

40 వేల ఏళ్లనాటి ఓ రాకాసి తల..

టాక్సీ దారి తప్పితే అలర్ట్‌

అలా చేస్తే.. మీకు పిజ్జా ఫ్రీ!!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

30న నిర్మాతల మండలి ఎన్నికలు

విరాటపర్వం ఆరంభం

లుక్‌ డేట్‌ లాక్‌?

ఆ టైమ్‌ వచ్చింది

పిల్లలకు మనం ఓ పుస్తకం కావాలి

బస్తీ మే సవాల్‌