లండన్‌లో పోలీసులపై సామూహిక దాడి!

24 Nov, 2016 08:59 IST|Sakshi
లండన్‌లో పోలీసులపై సామూహిక దాడి!

లండన్‌లోని లూయీషామ్‌ ప్రాంతం. నవంబర్‌ 9 సాయంత్రం 4 గంటలు. ఇద్దరు పోలీసు అధికారులు బిజీగా ఉండే గుడ్‌విడ్‌ రోడ్‌ మీద రోజులాగానే గస్తీ కాస్తున్నారు.  ఇంతలో ఒక పదిహేనేళ్ల కుర్రాడు పెద్ద కత్తిని దాస్తున్నట్లు వారు గమనించారు. ఇద్దరు పోలీసుల్లో ఒకరు ఆ కుర్రాడిని తనిఖీ చేయడం మొదలు పెట్టారు. అంతే ఒకేసారి దాదాపు 30 మంది ఆ పోలీసును చుట్టుముట్టి దాడి చేశారు. కింద పడిపోయిన అతడిని కాపాడేందుకు అతడి సహోద్యోగి అయిన పోలీస్‌ అధికారిణి రాగా.. ఆమె పైనా చేయి చేసుకున్నారు.

కిందపడిపోయిన పోలీసుపై పిడిగుద్దులు కురిపిస్తూ కాళ్లతో తంతూ దాడి కొనసాగించారు. అదనపు పోలీసు బలగాలు వచ్చి తమ సిబ్బంది ఇద్దరినీ రక్షించాయి. ఇంతకీ వారిపై దాడి చేసిన బృందం స్థానిక స్కూలు విద్యార్థులైన టీనేజర్లే! ఒక పదిహేనేళ్ల యువకుడిని మాత్రం అరెస్ట్‌ చేశారు. ఈ ఉదంతం గురించి స్కాట్‌ల్యాండ్‌ యార్డ్‌ పోలీసులు గురువారం వెల్లడించారు. అంతేకాదు.. ఆ దాడి దృశ్యాన్ని చూసిన వారు, మొబైల్‌ ఫోన్లలో వీడియో తీసిన వారు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని విజ్ఞప్తి కూడా చేశారు.

మరిన్ని వార్తలు