మనిషిలానే సాయం చేస్తుంది..

24 Apr, 2014 05:38 IST|Sakshi
మనిషిలానే సాయం చేస్తుంది..

అమెరికా రక్షణ రంగ శాస్త్రవేత్తలు రూపొందించిన మనిషి రూపంలోని నిలువెత్తు ‘అట్లాస్ రోబో’ ఇది. చూడటానికి హాలీవుడ్ సినిమా ‘టర్మినేటర్’లోని రోబోను తలపిస్తున్నా.. వాస్తవానికి ఇది యుద్ధ కార్యకలాపాల్లో కాకుండా సహాయక చర్యల్లో మాత్రమే పాల్గొంటుంది. భవనాలు కూలడం, భూకంపాలు సంభవించడం, సైనికులు గాయపడటం వంటివి జరిగినప్పుడు ప్రమాదకర పరిస్థితుల నుంచి బాధితులను రక్షిస్తుంది.
 
 విపత్తుల సమయంలో బాధితులను రక్షించే మనిషి రూపంలోని రోబోను సృష్టించే పోటీలో భాగంగా డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ(డార్పా) 6 అడుగుల 2 అంగుళాల పొడవు, 150 కేజీల బరువైన ఈ రోబోను తయారు చేసింది. ఎలాంటి ప్రదేశంలోనైనా, ఎగుడుదిగుళ్లు, శిథిలాల మధ్య నుంచీ భవనాల్లోకి ప్రవేశించి బాధితులను, గాయపడిన సైనికులను రక్షించగలిగేలా రూపొందించిన ఈ రోబోను మంగళవారం అమెరికా రక్షణ మంత్రి చక్ హెగెల్ పరిశీలించారు.

మరిన్ని వార్తలు