బస్స్టాప్లో పేలుడు : ముగ్గురికి గాయాలు

8 Dec, 2015 08:09 IST|Sakshi
బస్స్టాప్లో పేలుడు : ముగ్గురికి గాయాలు

మాస్కో : రష్యా రాజధాని మాస్కో నగరంలోని బస్స్టాప్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డగా... మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. వీరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. బస్స్టాప్ వద్ద కారులోకి ఆగంతకుడు మందుగుండు సామాగ్రి విసరడం వల్ల ఈ పేలుడు సంభవించిందని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. ఈ పేలుడు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని ఉన్నతాధికారి పేర్కొన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు