ట్రంప్ టీంలో మన దిగ్గజాలు

15 Apr, 2020 14:39 IST|Sakshi
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( ఫైల్ ఫోటో)

అమెరికా ఆర్థిక పునరుద్ధరణ బృందం

భారత సంతతికిచెందిన ఆరుగురు కార్పొరేట్లు

వాషింగ్టన్‌ : కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు.  వివిధ రంగాలకు అమెరికా అధ్యక్షుడు వివిధ పరిశ్రమలు, విభాగాలకు చెందిన 200 మందికి పైగా అగ్రశ్రేణి లీడర్లు, డజనుకు పైగా ఇతర నిపుణులతో వేర్వేరు గ్రూపులను ఏర్పాటు చేశారు. వీరంతా  అమెరికన్ ఆర్థిక వ్యవస్థను ఎలా పునరుద్ధరించాలనే దానిపై సిఫారసులను అందించనున్నారు.  వీరిలో భారత సంతతికి చెందిన ఐటీ, కార్పొరేట్ దిగ్గజాలు చోటు చేసుకోవడం విశేషం.

కరోనా పై పోరులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ టీంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్లతో సహా ఆరుగురు భారతీయ-అమెరికన్ కార్పొరేట్ దిగ్గజాలను ట్రంప్ ఎంపిక చేశారు. తెలివైన, ఉత్తమమైన ఈ నిపుణులు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ  ప్రణాళికలను, సూచనలు సలహాలు ఇవ్వబోతున్నారని  ట్రంప్  ప్రకటించారు. ఆపిల్ సీఈవో టిమ్ కుక్, ఒరాకిల్ లారీ ఎల్లిసన్, ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ,  టెస్లా సీఈవో ఎలోన్ మస్క్, ఫియట్ క్రిస్లర్  మైక్ మ్యాన్లీ, ఫోర్డ్ కు చెందిన  బిల్ ఫోర్డ్ , జనరల్ మేరీ బార్రా లాంటి దిగ్గజాలు కూడా  ట్రంప్  సలహా బృందంలో ఉన్నారు. ఆరోగ్యం, సంపద సృష్టి ప్రాథమిక లక్ష్యంగా ఈ ద్వైపాక్షిక సమూహాలు వైట్ హౌస్ తో కలిసి పనిచేస్తాయని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.(కరోనా : అమెజాన్‌లో 75 వేల ఉద్యోగాలు)

సుందర్ పిచాయ్‌, నాదెళ్లతో పాటు ఐబీఎం సీఈఓ అరవింద్‌ కృష్ణ, మైక్రాన్‌ సీఈఓ సంజయ్‌ మెహ్రోత్ర ఉన్నారు. వీరంతా సమాచార సాంకేతిక రంగం ఎదుర్కొంటున్నసమస్యలపై పరిష్కారాపై పనిచేస్తారు. అలాగే  ఉత్పత్తి రంగం పునరుత్తేజ సూచనలిచ్చే బృందానికి పెర్నాడ్‌ రికార్డ్‌ బివరేజ్‌ కంపెనీ సీఈఓ ఆన్‌ ముఖర్జీని ఎంపిక చేశారు. మాస్టర్‌ కార్డ్‌కు చెందిన అజయ్ బంగా ఆర్థిక రంగ పునరుద్ధరణ బృందంలో ఉన్నారు. వీటితోపాటు వ్యవసాయ, బ్యాంకింగ్‌, నిర్మాణ, కార్మిక, రక్షణ, ఇంధన, ఆర్థిక సేవలు, ఆరోగ్యం, పర్యాటక, తయారీ, రియల్ ఎస్టేట్, రిటైల్, టెక్, టెలికమ్యూనికేషన్, రవాణా, క్రీడలు ఇలా వివిధ టీంలను ట్రంప్ ఏర్పాటు చేశారు.  సంబంధిత రంగాలకు సంబంధించి ఈ బృందం  సలహాలను  అందివ్వనుంది.(విండ్ షీల్డ్స్‌తో ‘మహీంద్ర’ పీపీఈలు) (హెచ్-1 బీ వీసాదారులకు భారీ ఊరట)

మరిన్ని వార్తలు