భారత పర్యావరణ కృషి భేష్‌

22 Sep, 2019 04:01 IST|Sakshi

యూఎన్‌ ప్రధానకార్యదర్శి గుటెరెస్‌

ఐక్యరాజ్య సమితి: పర్యావరణ పరిరక్షణ కోసం భారత్‌ చేస్తున్న కృషి అద్భుతమని, సంప్రదాయేతర ఇంధన రంగాన్ని ముందుకు పరుగులు పెట్టించడంలో ఆ దేశం అమోఘంగా పనిచేస్తోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ కొనియాడారు. ప్రధాని మోదీని తను పలుమార్లు కలుసుకున్నానని సౌర విద్యుత్‌ని వినియోగించుకోవడానికి అంతర్జాతీయ దేశాలను కూడగట్టడంలో ఆయనలోని నాయకత్వ లక్షణాలు ప్రపంచానికి తెలిసాయని ప్రశంసించారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన గాంధీజీ సోలార్‌ పార్క్‌ని మోదీ 24న ప్రారంభించనున్నారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సుని పురస్కరించుకొని గుటెరెస్‌ మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా విందు సమావేశం ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్‌ రంగంలో భారత్‌ భారీగా పెట్టుబడులు పెడుతోందని, అయితే ఇంకా థర్మల్‌ పవర్‌ వినియోగాన్ని బాగా తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు.

మరిన్ని వార్తలు