నేటితో బడ్జెట్‌ సమావేశాల ముగింపు

22 Sep, 2019 04:03 IST|Sakshi

పీఏసీతో పాటు శాసనసభ కమిటీల ప్రకటన

ఎంఐఎంకు పీఏసీ, సోలిపేటకు అంచనాల కమిటీ?

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 9న ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఆదివారం శాసనసభ, శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం అనంతరం వాయిదా పడనున్నాయి. ఈ నెల 9న 2019–20 వార్షిక బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తర్వాత.. 14వ తేదీకి వాయిదా పడింది. 14న తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ వివిధ శాఖల పద్దులపై ఎనిమిది రోజులుగా చర్చించి ఆమోదం తెలిపింది. బడ్జెట్‌ సమావేశాల చివరి రోజున శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన అనంతరం సభను స్పీకర్‌ నిరవధికంగా వాయిదా వేస్తారు. శాసనమండలి కూడా బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఈ నెల 9న ప్రారంభం కాగా, ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్‌రావు బడ్జెట్‌ను సమర్పించారు. ఆదివారం పలు బిల్లులను ఆమోదించాక నిరవధికంగా వాయిదా పడనుంది. 

సభా కమిటీలపై ప్రకటన.. 
శాసనసభ బడ్జెట్‌ సమావేశాల ముగింపు సందర్భంగా శాసనసభ కమిటీలను ప్రకటించనున్నారు. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ, అంచనాల కమిటీ, అండర్‌ టేకింగ్స్‌ కమిటీ వంటి ఆర్థిక కమిటీలతో పాటు అసెంబ్లీలో మొత్తం 21 కమిటీ లు ఉంటాయి. కీలకమైన ప్రజా పద్దులు (పీఏసీ) కమిటీ పదవిని శాసనసభలో రెండో అతిపెద్ద పక్షంగా ఉన్న ఎంఐఎం ఆశిస్తోంది. ఆ పార్టీ శాసనసభ పక్షం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ పీఏసీ చైర్మన్‌ పదవి చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంచనాల కమిటీ చైర్మన్‌గా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి మరోమారు అవకాశం దక్కనుంది. మంత్రులుగా, విప్‌లుగా అవకాశం దక్కని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చైర్మన్లుగా, కమిటీ సభ్యులుగా అవకాశం దక్కనుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చాయ్‌ తాగుతవా? అని అడుగుతోంది’

సచివాలయం ఫైళ్లన్నీ భద్రం

రాష్ట్రానికి 3 జాతీయ జల మిషన్‌ అవార్డులు 

అందరికీ నాణ్యమైన విద్య: సబిత

దేశమంతా తెలియాలి

రాష్ట్రంలో నేడు, రేపు పలు చోట్ల వర్షాలు 

వినియోగదారుల ఫోరాల్లో  మహిళా సభ్యులు లేరు: హైకోర్టు

ప్లాస్టిక్‌పై బదులు తీర్చుకుందాం!

విద్యతోపాటే వర్క్‌ పర్మిట్‌

అసెంబ్లీ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ యత్నం

డెంగీ డేంజర్‌ ; కిట్లకు కటకట..

రైతులపై అదనపు వడ్డీ భారం వేయొద్దు

నిందితులంతా నేర చరితులే

కోడలే కూతురైన వేళ

ఈనాటి ముఖ్యాంశాలు

‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రాష్ట్రానికి విద్యుత్ భారం’

‘జాతీయ అటెండెన్స్ పాలసీ’ పెట్టండి: సబితా

'మాదిగ ఉపకులాలను రాజకీయ హత్య చేశారు'

‘కాంగ్రెస్‌ గెలుపు ప్రజాస్వామ్యానికి అవసరం’

సైదిరెడ్డికి మరో చాన్స్‌ ఇచ్చిన కేసీఆర్‌

కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ‘ఐటీఐఆర్’ని సాధించాలి

‘ఉత్తమ్‌ ఉత్త మెంటల్‌ కేస్‌’

'ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ఒరగబెట్టిందేమి లేదు'

‘ఆన్‌లైన్‌ సినిమా టికెట్లు త్వరలో రద్దు’

ఆరుబయట మలవిసర్జనకు రూ.1000 కట్టాల్సిందే..

అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన ఎన్‌ఎస్‌యూఐ

ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా చొప్పదండి

‘అభయహస్తం’ కోసం ఎదురుచూపులు

కామాంధుడికి జీవిత ఖైదు

రేవంత్‌ది తప్పు.. ఉత్తమ్‌కే అధికారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆస్కార్స్‌కు గల్లీ బాయ్‌

నేడే సైరా ప్రీ–రిలీజ్‌ వేడుక

సంక్రాంతికి మంచివాడు

డేట్‌ ఫిక్స్‌

24 గంటల్లో...

అవార్డు వస్తుందా?